Deve Gowda Support to CM KCR: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈమేరకు కేసీఆర్‌కు దేవెగౌడ ఫోన్ చేశారు.
భాజపాపై కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేవెగౌడ - సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ మద్దతు
17:01 February 15
భాజపాపై కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేవెగౌడ
'రావు సాబ్... మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.' అని సీఎం కేసీఆర్‌కు దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు.
మమతా బెనర్జీ ఫోన్
భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ... కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు
ఇదీ చదవండి :సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు... కేసు నమోదు యోచనలో పోలీసులు!