Ponnala Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులుగా దిల్లీలో దేనికోసం ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విభజన సమస్యలపై నోరు విప్పాడా అంటే అదీ లేదు.. ఎందుకు ఆయన ఉండి ప్రయోజనం అని నిలదీశారు. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ అంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు' - Lakshmaiah raised the flag against KCR ruling
Ponnala Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులుగా దిల్లీలో దేనికోసం ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విభజన సమస్యలపై నోరు విప్పాడా అంటే అదీ లేదు.. ఆయన ఉండి ఏమాత్రం ప్రయోజనం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ అంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Ponnala Lakshmaiah
దేశంలో సచివాలయానికి రాకుండా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఫాంహౌస్ ఎలా వచ్చింది.. అక్కడ భూములు ఎలా విస్తరణ జరిగాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: