ప్రణబ్ ముఖర్జీ మృతికి మాజీ ఎంపీ వివేక్ ప్రగాఢ సంతాపం - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి మాజీ ఎంపీ వివేక్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
![ప్రణబ్ ముఖర్జీ మృతికి మాజీ ఎంపీ వివేక్ ప్రగాఢ సంతాపం former mp vivek pay tribute to pranab mukherjee on his death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8630968-1017-8630968-1598889098897.jpg)
ప్రణబ్ ముఖర్జీ మృతికి మాజీ ఎంపీ వివేక్ ప్రగాఢ సంతాపం
భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయ ప్రణబ్ ముఖర్జీ.. నాయకుడు మా నాన్న వెంకటస్వామికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని వివేక్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రణబ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.