వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని మాజీ మంత్రి పరిటాల సునీత(paritala sunitha comments) అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగిలేవారు కాదని వైకాపా నేతలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని మాజీ మంత్రి పరిటాల సునీత(ex minister paritala sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలోకి వచ్చాక శాంతంగా ఉండమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని అన్నారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని మండిపడ్డారు.