భాజపాలో చేరనున్న మాజీమంత్రి మోత్కుపల్లి - కాషాయ కండువా
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. భాజపాలో చేరేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

భాజపాలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కాషాయతీర్థం పుచ్చుకుని రెండ్రోజులు కూడా గడవకముందే మరో అగ్రనేత కాషాయ కండువ కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఇంటికి వెళ్లి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపాక మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దిల్లీలో కమలదళపతి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతారని రాష్ట్ర నేతలు తెలిపారు. ఈనెల 18న జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారని ఆయన సమక్షంలో తెదేపాకు చెందిన ముఖ్యనేతలు కమలతీర్థం పుచ్చుకోనున్నారని లక్ష్మణ్ వెల్లడించారు.
- ఇదీ చూడండి : కర్ణాటక: ప్రాణాల కోసం సాహసం చేయాల్సిందే.!