మాజీ మావోయిస్టులు వారణాసి సుబ్రహ్మణ్యం, అతని సహచరి లక్ష్మీలను ఏపీ పోలీసులే అదుపులోకి తీసుకున్నారని.. పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆరోపించారు. చండీగఢ్‌లో మోకాలి ఆపరేషన్ చేయించుకుని వస్తున్న వారిని సుబ్రహ్మణ్యం బావమరిది రిసీవ్ చేసుకునేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్లారని వివరించారు. అప్పటి నుంచి వారి ఫోన్లు పనిచేయటం లేదని తెలిపారు. అతని బావమరిది కారు మాత్రం రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేశారన్నారని చంద్రశేఖర్ చెప్పారు.
పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టులు..? - Maoists in police custody news
మాజీ మావోయిస్టులు వారణాసి సుబ్రహ్మణ్యం, అతని సహచరి లక్ష్మీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. పౌరహక్కుల సంఘం నేత చంద్రశేఖర్ పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా అదుపులోకి తీసుకున్నవారిని.. వెెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టులు..?
సుబ్రహ్మణ్యం తెలంగాణలో నివసించటానికి సహాయపడ్డాడని టీవీవీ రాష్ట్ర బాధ్యునిపై కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటారని అన్నారు. మూడేళ్ల కిందట అరెస్టై బెయిల్ తీసుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి షెల్టర్ ఇవ్వటం ఏవిధంగా నేరమవుతుందని చంద్రశేఖర్ ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ద్వారా అదుపులోకి తీసుకున్నవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండీ :మలివయసులోనూ పెన్నూ, పేపరు చేతపట్టి..