ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. పోస్టింగ్ కోసం రెండుసార్లు ప్రభుత్వానికి లేఖ రాశానని పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు, విచారణలు లేవని తెలిపారు. ఆరోపణలతో ఇంతకాలం కొన్ని అభియోగాలు మోపి పోస్టింగ్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పరికరాల కొనుగోలు అంశంపై 2020 ఫిబ్రవరి 2న రాష్ట్ర డీజీపీ నుంచి మెమో వచ్చిందని వివరించారు. 2020 ఫిబ్రవరి 8 నుంచి తనను సస్పెన్షన్‌లో ఉంచారన్నారు.
"అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు...."
'సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ క్యాట్, హైకోర్టులో పిటిషన్ వేశా. 10 నెలల సస్పెన్షన్ తర్వాత నాపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ జారీ చేశారు. నన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. ఈ అంశాలన్నీ ఐపీఎస్ అధికారుల సంఘం చర్చించాలని కోరుతున్నా. సంఘం నాకు వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నా. ఐపీఎస్ అధికారుల సంఘం నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఆశించట్లేదు. కేవలం ప్రభుత్వం నుంచి వేధింపులు లేకుండా చూడాలన్నదే నా అభిమతం' - ఏబీ వెంకటేశ్వరారవు, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
ఇదీ చదవండి:50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు: హరీశ్‌రావు