తెలంగాణ

telangana

ETV Bharat / city

Kumble met Jagan: సీఎం జగన్​మోహన్​రెడ్డిని కలిసిన అనిల్ కుంబ్లే - latest news in guntur district

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను, ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకారిస్తానని కుంబ్లే తెలిపారు.

indian
అనిల్ కుంబ్లే

By

Published : Jul 5, 2021, 6:40 PM IST

భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అనిల్ కుంబ్లే.. ముఖ్యమంత్రితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకరిస్తానని కుంబ్లే తెలిపారు.

క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీపై దృష్టి సారించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాల నుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటున్నామని వెల్లడించారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాట్లు కుంబ్లే తెలిపారు.


ఇదీ చదవండీ..ready made house: చిటికెలో ఇల్లు తయార్​.. ఎటైనా తీసుకెళ్లేలా అద్భుత సౌకర్యం!

ABOUT THE AUTHOR

...view details