కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. అంబర్‌పేటలోని వీహెచ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చించారు.
'త్వరలో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం' - రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ వ్యవహారాలపై వీహెచ్ దామోదర రాజనర్సింహ చర్చలు
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చర్చించారు. అంబర్‌పేటలోని వీహెచ్ నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు.
త్వరలో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల పేదల ఇబ్బందులు, పార్టీలో అంతర్గత విషయాలపై కోర్ కమిటీలో చర్చించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీని సమావేశ పరచాలని.. ఈ విషయమై వీహెచ్ ఇప్పటికే రాష్ట్ర ఇంఛార్జి కుంతియాతో చర్చించినట్లు వీహెచ్ తెలిపారు. ఇతర ఇంఛార్జీలతో మాట్లాడి త్వరలో కోర్ కమిటీ సమావేశం జరపాలని కోరుతామని తెలిపారు.
ఇదీ చూడండి:లక్షణాలు లేకుండా కరోనా బారిన పడిన వారు ఏం చేయాలి..?