తెలంగాణ

telangana

ETV Bharat / city

మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత - former ap cs sv prasad died at hyderabad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్వీ ప్రసాద్​ కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ యశోద ఆస్పత్రిలో మృతిచెందారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో సీఎస్‌గా పనిచేశారు.

ex cs sv prasad is no more
మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత

By

Published : Jun 1, 2021, 8:33 AM IST

మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఆయన.. 1975 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.

నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్‌, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు.

2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్‌ పోస్టు వరించింది. పదేళ్లకు పైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఎస్వీ ప్రసాద్‌ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details