హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో పచ్చదనం 7.7శాతం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక స్పష్టం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక విభిన్న పథకాల్లో ఒకటైన హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు తెలిపింది. 33 శాతం పచ్చదనమే లక్ష్యంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది. గత ఎనిమిదేళ్లలో 8,511 కోట్ల రూపాయల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపిన సర్కార్.. తొమ్మిది లక్షల పైచిలుకు ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగిందని వివరించింది.
రాష్ట్రంలో 7.7 శాతం పెరిగిన పచ్చదనం.. హరితహారంతోనే సుసాధ్యం.. - హరితహారంతోనే సుసాధ్యం
తెలంగాణలో పచ్చదనం పెరుగుదలపై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. నాలుగేళ్లలో రాష్ట్రంలో 7.7 శాతం పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసినట్టు పేర్కొంది.
హరితహారంలో భాగంగా.. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.. వినూత్న పద్ధతిలో అన్నివర్గాలను భాగస్వామ్యం చేస్తూ.. గ్రీన్ బడ్జెట్ ఏర్పాటుతో పాటు పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల్లో పదిశాతం హరితబడ్జెట్ను ప్రత్యేకంగా కేటాయించి, ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లోనూ నర్సరీల ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకుంటున్నారని పేర్కొంది. గ్రామ పంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, మొక్కల సంరక్షణకు ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వం వివరించింది.
ఇవీ చూడండి: