కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్ బయోటెక్‌ను విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందం ఇవాళ సందర్శించనుంది. దేశంలో కొవిడ్‌పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేసే లక్ష్యంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఉన్నత స్థాయి సందర్శనను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి చేరుకుటుంది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్‌కి వెళ్లి అక్కడ కొవాగ్జిన్‌కి సంబంధించి జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకుంటారు.
నేడు భారత్ బయోటెక్‌కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు - covaxin phase 3
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందం నేడు సందర్శించనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు నగరంలో ఈ బృందం పర్యటించనుంది. సందర్శన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కొవాగ్జిన్ టీకా... రెండు దశల ట్రయల్స్‌ని పూర్తి చేసుకుని మూడో దశ సైతం ముగింపు దశలో ఉన్న తరుణంలో ఈ సందర్శన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతో రాయబారుల బృందం భేటీ కానుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా విదేశీ రాయబారులు దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత బయోటెక్ లిమిటెడ్‌తో పాటు... ఈ- బయోలాజికల్ సంస్థ యూనిట్లను సందర్శించనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్... కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి భారత్ బయోటెక్‌కి చేరుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
భారత్ బయోటెక్ కొవిడ్ నియంత్రణకు రూపొందిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్... ఇప్పటికే మానవులపై రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మూడో దశ సైతం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతుల కోసం భారత్ బయెటెక్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో విదేశీ రాయబారులు, హైకమిషనర్ల సందర్శన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.