తెలంగాణ

telangana

ETV Bharat / city

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి - Pulicat Lake news

విదేశీ విహంగాలు విడిదికి వచ్చేస్తున్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల సంతతి కేంద్రానికి విదేశీ పక్షుల రాక మొదలైంది. వీటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

pulikat pond
పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

By

Published : Nov 14, 2020, 11:03 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులోకి ఇప్పుడిప్పుడే పక్షుల రాక మొదలైంది. చల్లని వాతావరణంలో పులికాట్ సరస్సులో పక్షులు ఆహ్లదకరంగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు సందర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. పులికాట్ సరస్సులోకి వర్షాలతో నీరు చేరుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉండటంతో విదేశీ విహాంగాలు దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటి ఆహార బాంఢాగారమైన పులికాట్​కు చేరుకుని ఆహారం సేకరించుకుంటున్నాయి.

పులికాట్ మధ్యలో రోడ్డు మార్గాన సముద్రతీరంలో శ్రీ హరికోట ఉండటంతో అంతరిక్ష కేంద్రం నుంచి జరిగే ప్రయోగాలు తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. పక్షుల సంతతి కేంద్రం నేలపట్టుకు సందర్శకులకు అనుమతి లేకపోవడంతో.. పులికాట్ సరస్సు రోడ్డు మార్గంలో పక్షులను వీక్షించేందుకు అనువుగా ఉండటంతో ఇక్కడికి చేరుకుంటున్నారు.

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

ABOUT THE AUTHOR

...view details