హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా ఎస్‌హెచ్‌వో(SHO)గా సీఐ మధులత బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్ సమక్షంలో... లాలాగూడ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా మధులత విధులు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన మధులత.. పాతబస్తీ మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా గతంలో పనిచేశారు.
నగర పోలీస్ చరిత్రలోనే తొలిసారి.. మహిళా ఎస్‌హెచ్‌వోగా మధులత బాధ్యతలు
హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీసు అధికారి.. ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. సీఐ మధులతకు.. హోం మంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు అప్పగించారు.
For the first time in hyderabad police history a women Police Madhulatha take charge as SHO
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్ పోలీసు చరిత్రలో తొలిసారి ఆమెకు ఎస్‌హెచ్‌వో బాధ్యతలు అప్పగించారు. మధులత మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. మహిళా పోలీసులు సవాళ్లను స్వీకరించాలన్నారు. ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. సీఐ మధులతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: