తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారం కోసం... అశాంతి సృష్టిస్తున్నారు..! - CAA BILL TELANGANA LATEST UPDATE NEWS

కాంగ్రెస్​ నేతలు... అధికారం కోసం దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని వీహెచ్​పీ నేతలు ఆరోపించారు. గతంలో పౌరసత్వ చట్ట సవరణకు ప్రయత్నాలు చేసిన హస్తం నేతలు.. భాజపా చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.

అధికారం కోసం... అశాంతి సృష్టిస్తున్నారు..!
అధికారం కోసం... అశాంతి సృష్టిస్తున్నారు..!

By

Published : Dec 21, 2019, 6:41 PM IST

అధికారం కోసం దేశంలో కొందరు అశాంతి సృష్టిస్తున్నారని.. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే కాంగ్రెస్, వామపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని వీహెచ్​పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో పౌరసత్వ చట్ట సవరణకు ప్రయత్నాలు చేసిందని.. ఈ బిల్లుకు అనుకూలంగా చట్ట సభల్లో మాట్లాడిందని గుర్తుచేశారు. ఆ పని భాజపా చేస్తే ఇప్పడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్​లో దళితులు వివక్షకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టంలో భారత్​లో ఉండే ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.

అధికారం కోసం... అశాంతి సృష్టిస్తున్నారు..!

ఇవీ చూడండి: వదంతులు నమ్మి మోసపోకండి: అసోం సీఎం

ABOUT THE AUTHOR

...view details