తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫైవ్​స్టార్​ హోటల్​ల్లో ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు - gachibowli 5 star hotels

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్​ హోటల్(gachibowli 5 star hotels)పై ఎఫ్‌‌ఎస్ఎస్‌ఏఐ అధికారులు దాడులు చేపట్టారు. ఆహారపు నిల్వల్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులతో కలిసి పంచనామా చేశారు. ఇందుకు సంబంధించిన తనిఖీలపై నగర కమిషనర్​​కు సమాచారం అందించారు.

food safety officers inspection in mind space five star hotels in Hyderabad
food safety officers inspection in mind space five star hotels in Hyderabad

By

Published : Sep 21, 2021, 10:40 PM IST

గడువు ముగిసినా నిల్వ ఉంచిన చికెన్​

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని వెస్టిన్ మైండ్​స్పేస్ ఫైవ్​స్టార్ హోటల్​(westin hyderabad mindspace)లో ఎఫ్‌‌ఎస్ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాం డర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆహార నిల్వల్లో కనీస ప్రమాణాలు పాటించనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వంటగది​ పరిశుభ్రత విషయంలో యాజమాన్యం(five star hotels in hyderabad) నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడించారు. వెజ్, నాన్​వెజ్​ పదార్థాలను ఒకే చోట నిల్వ చేసినట్లు పేర్కొన్నారు.

గడ్డకట్టిన మాంసపు కవర్​

బేకరీలో నిల్వ ఉంచిన పలు ఆహార పదార్థాల గడువు ముగిసినవిగా ఉన్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి పంచనామా చేశారు. ఈ వ్యవహారాన్ని నగర కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ తనిఖీలో ఎఫ్‌‌ఎస్ఎస్‌ఏఐ - తెలంగాణ జాయింట్ డైరెక్టర్ కేఏ అరూల్ ఆనంద్, టెక్నికల్ అధికారి సాయిశివతో పాటు జీహెచ్​ఎంసీ పుడ్ సేఫ్టీ(శేరిలింగంపల్లి) అధికారి పాల్గొన్నారు.

గడువు ముగిసిన బేకరీ పదర్థాలు...

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details