తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ

దేశంలో అత్యధికంగా పసుపు పండించే తెలంగాణలో.. ఆ వనరు ముడిసరకుగా ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి(ఐఎస్‌బీ) రాష్ట్ర ఉద్యానశాఖకు సిఫార్సు చేసింది. మైసూర్‌లోని ‘కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ’(సీఎఫ్‌టీఆర్‌ఐ) తెలంగాణలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని ముందుకొచ్చింది.

food processing industry in telangana
పసుపు ముడి సరుకుగా రాష్ట్రంలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ

By

Published : Mar 21, 2020, 10:07 AM IST

మైసూర్​లోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ(సీఎఫ్​టీఆర్​ఐ) సహకారంతో హైదరాబాద్​ నగర శివారు జీడిమెట్లలో ఉద్యానశాఖ ‘ఆహార శుద్ధి, ఉత్పత్తుల తయారీ ప్లాంటు’ ఏర్పాటు చేస్తోంది. దీనికి కార్యాచరణ సాగుతోంది. ఇది పూర్తయిన తరువాత నాణ్యమైన పసుపు పొడితో పాటు ఇతర ఉత్పత్తులు కూడా తయారీ చేయాలనే ప్రణాళిక ఉంది.

దేశంలోనే అధికంగా పసుపు పండించే తెలంగాణలో.. ఆ వనరు ముడి సరుకుగా ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి(ఐఎస్​బీ) రాష్ట్ర ఉద్యాన శాఖకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు మేరకు సీఎఫ్​టీఆర్​ఐ రాష్ట్రంలో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని ముందుకొచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసుపు పంటకు మంచి డిమాండ్​ ఉంది. ఇటీవలి కాలంలో పసుపు, తేనె, గిలాటిన్‌లను కలిపి కేకులు... నువ్వులు, సబ్జి గింజలతో బిస్కట్లు వంటివి తయారుచేస్తున్నారు. మద్యం, టీ తయారీలోనూ పసుపు వాడుతున్నారు.

రాష్ట్రంలో లక్షా 33 వేల ఎకరాల్లో పసుపు సాగు

రాష్ట్రంలో లక్షా 33 వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఏటా 28.10 లక్షల క్వింటాళ్ల దిగుబడితో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ పంట విలువ రూ.1687 కోట్లుగా అంచనా.

రైతులే నేరుగా శుద్ధి చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం

ఎకరా పసుపు సాగుకు రూ.1.19 లక్షల వ్యయమవుతోంది. రైతు కిలో పసుపును రూ.60కి అమ్మితే దాన్ని శుద్ధి చేసి పొడిగా మార్చి వినియోగదారులకు కిలో రూ.120కి విక్రయిస్తున్నారు. రైతులే నేరుగా శుద్ధి చేసి అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది.

వేడినీటిలో కలిపి తాగండి
వేడినీటిలో కలిపి తాగండి

ఉదయమే వేడినీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, జలుబు, దగ్గు నియంత్రణకు ఔషధంలా ఉపకరిస్తుందని, తద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ ఆహారంలో కనీసం 5 గ్రాముల పసుపు వాడితే మంచిదన్నారు. తెలంగాణలో పండే పసుపులో ఎన్నో విలువైన ఔషధ గుణాలున్నాయని ఆయన చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details