తెలంగాణ

telangana

ETV Bharat / city

రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలేంటో తెలుసా! - immunity boost up food

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మొదట వారికి కావాల్సింది రోగనిరోధకతే. దీన్ని సొంతం చేసుకోవాలంటే పోషకాలున్న ఆహారం అందించాలి. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా!

food habits which increases immunity power in children
రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలేంటో తెలుసా!

By

Published : Aug 29, 2020, 8:24 AM IST

బాదం: వీటిలో మాంగనీస్‌, విటమిన్‌-ఇ, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి రోజూ గుప్పెడు బాదం గింజలను చిన్నారులకు పెట్టండి.

పెరుగు: దీని ద్వారా పొటాషియం, మెగ్నీషియంలతోపాటు ఎముకలు దృఢంగా మారడానికి అవసరమయ్యే క్యాల్షియం కూడా లభిస్తుంది. రోజూ రెండు పూటలా కప్పు పెరుగు తీసుకునేలా చూడండి.

చేపలు:వీటిలో శరీరానికి మేలు చేసే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి మెదడు ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. వ్యాధి నిరోధకతనూ పెంచుతాయి. పిల్లలకు నచ్చేలా ముళ్లు లేకుండా కట్‌లెట్‌ మాదిరిగా చేసిస్తే ఇష్టంగా తింటారు.

పాలకూర:దీనిలోని విటమిన్లు, మినరళ్లు కావాల్సిన శక్తిని అందించడంతోపాటు రోగనిరోధకతను పెంపొందిస్తాయి. దీంట్లో విటమిన్‌-ఎ, సి, ఇ, కె ఉంటాయి. ఫొలేట్‌, మాంగనీస్‌, జింక్‌, సెలీనియం, ఇనుము లభిస్తాయి.

గింజలు: గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. వీటిలో విటమిన్‌-ఇ, జింక్‌, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో ముందుంటాయి.

ABOUT THE AUTHOR

...view details