చెల్లెలి ఏడుపును ఆపేందుకు అప్పటికప్పుడు స్వయంగా ఓ పాట పాడి ఊరుకోబెట్టింది.. ఆ చిన్నారి. మూడేళ్ల చిరు ప్రాయంలో మొదలైన ఆ పాటల ప్రవాహం ... ఎన్నో మైలురాళ్లు దాటింది. ఒకవైపు సినిమా పాటలు, మరో వైపు జానపద గీతాలతో ... సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుంది హైదరాబాద్ యువతి ...స్ఫూర్తి జితేందర్.
టాప్-10 పాప్ సింగర్లలో ఒకదాన్నవుతా..
చెల్లి ఏడుపు ఆపేందుకు లాలిపాటతో మొదలుపెట్టిన ఆమె పాటల పల్లకి.. ఎన్నో మైలురాళ్లు దాటి.. సినిమాలు, జానపద గీతాలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆమే.. హైదరాబాద్‌కు చెందిన స్ఫూర్తి జితేందర్. అమెరికా వెళ్లి వెస్టర్న్ మ్యూజిక్‌లో డిప్లొమా చేసి హాలీవుడ్లో జానపదం వినిపిస్తానంటోంది.
సింగర్ స్ఫూర్తి, స్ఫూర్తి జితేందర్
అమెరికా వెళ్లి సంగీతంలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు సన్నద్ధమవుతున్న ఈ ప్రతిభాశాలి ...పాప్ టాప్-10 గాయకుల జాబితాలో చోటు దక్కించుకోవటంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో గ్రామీ అవార్డు సొంతం చేసుకోవడమే లక్ష్యమంటున్న యువ గాయని స్ఫూర్తి జితేందర్‌తో ఈటీవీ ముఖాముఖి..
- ఇదీ చదవండి :'మోహన' గానానికి క్రేజ్ పెరిగిన వేళ