తెలంగాణ

telangana

ETV Bharat / city

Fog in Hyderabad: పొగమంచు కురిసింది.. భాగ్యనగరం మురిసింది.. - హైదరాబాద్​లో పొగమంచు

Fog in Hyderabad : హైదరాబాద్​ను పొగమంచు కప్పేసింది. చలి తీవ్రతతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలలో మంచు కమ్మేసి రహదారులు కనిపించక వాహనాదారులు అవస్థలు పడుతున్నారు. శీతాకాలంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైతే వేకువజామున ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి ప్రయాణమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు.

Fog in Hyderabad
Fog in Hyderabad

By

Published : Dec 27, 2021, 9:51 AM IST

Updated : Dec 27, 2021, 10:59 AM IST

పొగమంచు కురిసింది.. భాగ్యనగరం మురిసింది..

Fog in Hyderabad : పొగమంచు దుప్పట్లో భాగ్యనగరం వణుకుతోంది. నగరంలోని పలు ప్రాంతాలను మంచు కమ్మేసింది. శివారు ప్రాంతాలతో పాటు బాహ్యవలయ రహదారిపై పొగమంచు కమ్మేసి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే మనుషులు, వాహనాలు కనిపించకపోవటంతో.. లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయటంతో.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

భాగ్యనగరంలో సూర్యోదయం

Adibatla Accident Today : రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రహదారులు సరిగ్గా కనిపించక ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న కారును మరో 2 కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి.

ఆదిభట్లలో ప్రమాదం

Snow in Hyderabad : శీతాకాలంలో పొగమంచు కురవడం సర్వసాధారణమని.. కానీ వాహనదారులు తెల్లవారుజామున ప్రయాణం చేయాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనియెడల ప్రమాదాలు తప్పవని చెబుతున్నారు. ఒకవేళ శీతాకాలం వేకువజామున ప్రయాణం తప్పనిసరిగా చేయాల్సివస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

తప్పనిసరిగా ప్రయాణమైతే..

  • Snow in Hyderabad Today : తెల్లవారుజాము నుంచి ఉదయం వెలుతురు స్పష్టంగా వచ్చే వరకు అప్రమత్తత అవసరం.
  • పొగమంచు పరిస్థితుల్లో ఉదయం వెళ్లకపోవడమే శ్రేయస్కరం. వెలుతురు స్పష్టంగా ఉన్నపుడే ప్రయాణం మొదలుపెట్టాలి.
  • పొగమంచులో సూక్ష్మ నీటి బిందువులు ఉంటాయి. మసకగా ఉన్న సమయంలో హైబీమ్‌ హెడ్‌ లైట్స్‌ (దూరంగా ప్రసరించే) వేయకూడదు. ఆ లైట్లు వేస్తే నీటి బిందువులు ప్రతిబింబించి వెలుతురు నిరుపయోగమవుతుంది. లో బీమ్‌ హెడ్‌ లైట్లు(దగ్గరగా ప్రసరించే) డ్రైవర్లకు ఉపయుక్తం.
  • అద్దాలపై తేమ వల్ల ముందున్న వాహనాలు కనిపించని పరిస్థ్థితులు నెలకొంటే తేమను తొలగించేందుకు వైపర్‌లు, డీ ఫ్రోస్టర్‌లు వేగంగా వినియోగించాలి.
  • పరిమిత వేగంతో వాహనాలు నడిపించాలి. వాహనాల మధ్య నిర్ణీత దూరం ఇదివరకు మాదిరిగా కాకుండా ఎక్కువగా తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో బ్రేకులు వేసేందుకు వీలవుతుంది.
  • బ్రేకు వేయడానికి ముందు.. రేర్‌ వ్యూ మిర్రర్‌ ద్వారా వెనుక వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలించాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను నిలపాల్సి వస్తే ప్రధాన రహదారి (క్యారేజ్‌వే)పై పార్క్‌ చేయకుండా ఇతర వాహనాలు, పాదచారులకు అవాంతరాలు కలగని సురక్షిత ప్రదేశాల్లోనే నిలపాలి. హజార్డ్‌ లైట్లు ఆన్‌లో ఉంచాలి.
  • రహదారులపై లేన్‌ మారుస్తున్నపుడు, మలుపు తీసుకుంటున్నపుడు కిటికీ అద్దాలు కొంతమేర కిందికి దించి ఇతర వాహనాల శబ్దాలు గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగాలి.
  • క్రమం తప్పకుండా హారన్‌ మోగిస్తూ ముందు వెళ్తున్న వాహనాలను అప్రమత్తం చేయాలి.
Last Updated : Dec 27, 2021, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details