ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేశాయి. ఉదయం వేళల్లో విపరీతమైన మంచు కురుస్తూ.. ఆకట్టుకుంటోంది.
కోనసీమ మంచు అందాలు.. ప్రకృతి రమణీయతకు సాక్ష్యాలు - కోనసీమ మంచు అందాలు తాజా వార్తలు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన మంచు కురుస్తూ ఆకట్టుకుంటోంది.
కోనసీమ మంచు అందాలు.. ప్రకృతి రమణీయతకు సాక్ష్యాలు
కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో మంచు అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. పక్షుల కిలకిల రాగాల నడుమ కొబ్బరి చెట్లు, ఇళ్లు, పంట పొలాలపై కురుస్తున్న మంచు తెరలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి.
ఇవీచూడండి:16 లక్షల దీపాల వెలుగులో మెరిసిన అంజన్న