శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7, 78,430 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 184.81 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 8,82,690 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఔట్ ఫ్లో 8 లక్షల 81 వేల 28గా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,194 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు విడుదల చేయగా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
శ్రీశైలానికి భారీగా వరద.. 8.81 లక్షల క్యూసెక్కులు విడుదల - వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా... జలాశయం జలకళ సంతరించుకుంది. 10 గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు.
శ్రీశైలానికి భారీగా వరద.. 8.81 లక్షల క్యూసెక్కులు విడుదల