Flood water problem: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజవర్గంలోని నాగోల్ డివిజన్లో పలు కాలనీలు గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటమునిగాయి. నాగోల్లోని సాయిరామ్ నగర్, వెంకటరమణనగర్, బీఎన్ రెడ్డి, పద్మావతి కాలనీల్లోని రహదారులు ఇప్పుడు వరదనీటిలోనే ఉన్నాయి. ఇక్కడ వర్షపు నీరు బండ్లగూడ చెరువులోకి వెళ్లాలి. అక్కడ నుంచి నాగోల్ చెరువులోకి ఈ వరద నీరు మొత్తం వెళుతోంది. అది కూడా నిండిన అనంతరం నాలాల ద్వారా కిలోమీటర్ దూరంలో ఉన్న మూసీ నదిలో కలుస్తోంది.
Flood water problem: ఈ వరదనీరు పోయే మార్గం ఎట్లా..? - నగరంలో వానలు
Flood water problem: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని నాగోల్ పరిసర కాలనీలు ముంపునకు గురయ్యాయి. వర్షం నీరు సక్రమంగా వెళ్లేందుకు నాలాలు సరిగా లేకపోవడంతో వరద నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోయి, కాలనీల్లోకి ప్రవేశిస్తోంది.
వరద నీరు
కానీ సరైన నాలా సదుపాయం లేకపోవడంతో వరద నీరు ఎక్కువై డ్రైనేజీ ద్వారా వచ్చి బయటకి పొంగుతుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యి, మురికినీరు చేరడం వల్ల దుర్గంధం భరితమైన వాసనను వెదజల్లుతూ కాలనీవాసులకు సమస్యగా మారుతోంది. దీనితో ఈ కాలనీల్లో భారీవర్షాలు పడ్డ ప్రతిసారీ ఇదే సమస్య వస్తోందని స్థానికులు వాపోయారు. వెంటనే సరైన నాలా ఏర్పాటు చేసి ఈ కాలనీలను వరద ముంపు నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: