వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల హైదరాబాద్లోని జంట జలాశయాల్లో వరద నీరు తగ్గుతోంది. హిమాయత్ సాగర్లో ప్రస్తుతం 1,763 అడుగుల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి 675 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఒక గేటును మాత్రమే తెరిచి 686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
హైదరాబాద్లోని జంట జలాశయాల్లో వరద తగ్గుముఖం - hyderabad latest news
వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయానికి వరద నీరు తగ్గుతోంది. హిమాయత్ సాగర్ వద్ద ఒక గేటు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు.
హైదరాబాద్లోని జంట జలాశయాల్లో వరద తగ్గుముఖం
ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1783. 28 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది.
ఇవీచూడండి:3 రోజులు దాటినా నీటిలోనే పలు కాలనీలు