ఎన్నికల అనంతరం సాయం చేస్తామని చెప్పడం వల్ల వరద బాధితులు పెద్ద ఎత్తున మీసేవా కేంద్రాలు, కార్పొరేటర్ల ఇళ్ల వద్దకు చేరుతున్నారు. తమకు వరద సాయం అందించాలని కోరుతున్నారు.
సీతాఫల్మండి కార్పొరేటర్ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన - flood victims in Hyderabad
వరదల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు.
![సీతాఫల్మండి కార్పొరేటర్ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన flood victims protest at Sitaphalmandi corporator's home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9790924-thumbnail-3x2-a.jpg)
సీతాఫల్మండి కార్పొరేటర్ ఇంటి వద్ద వరద బాధితుల ఆందోళన
సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ ఇంటి వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరదల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరద బాధితుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని సర్ది చెప్పి పంపించారు.