తెలంగాణ

telangana

ETV Bharat / city

అబిడ్స్‌ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన - abids ghmc office updates

అసలైన వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

flood victims protest at abids ghmc office
అబిడ్స్‌ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన

By

Published : Nov 6, 2020, 5:47 PM IST

రెండో విడతలో కూడా అసలైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందడం లేదని అంబర్‌పేట్ ఓల్డ్‌ప్రేమ్ నగర్ బస్తీకు చెందిన మహిళలు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రోజులు గడుస్తున్నా వరద బాధితులకు మాత్రం ఆర్థిక సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తెరాస నాయకులు వారికి అనుకూలమైన వారికే 10 వేల సహాయాన్ని అందిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సహాయం అందని వారికి 10 వేలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండ: అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది: తలసాని

ABOUT THE AUTHOR

...view details