Floods: గోదావరి వరదలతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలోని ధవళేశ్వరంలో గరిష్ఠ వరద ప్రవాహం ఆనకట్టను తాకగా.. బ్యారేజీ వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 21.70 అడుగులగా కొనసాగుతోంది. ఇప్పటివరకు బ్యారేజీ నుంచి పంటకాల్వలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. సముద్రంలోకి 25.80 లక్షల క్కూసెక్కులు విడిచిపెట్టారు.
బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికి ఇప్పటికి కొనసాగుతోంది. రాజమహేంద్రవరం వంతెనపై వాహనాల వరద ఉద్ధృతి దృష్ట్యా ఆర్టీసీ బస్సులు, లారీల రాకపోకలు నిలిపివేయగా.. బైకులు, ఆటోలు, కార్ల రాకపోకలు సాగించేందుకు అనుమతినిచ్చారు.
కోనసీమ..కోనసీమ తీరం అత్యంత ప్రమాదకరంగానే ఉంది. గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు వరదలోనే మగ్గిపోతుండగా.. కొన్నిచోట్ల వరద ప్రవాహం ఏటిగట్లను తాకింది. రాజోలు నున్నవారిబాడవలో ఏటిగట్టుపై భారీగా వరద నీరు వస్తోంది.