ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీశైలం జలాశయంలో(srisailm project) వరద ప్రవాహం తగ్గుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 811.70 అడుగులుగా ఉంది. డ్యాము గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 35.2772 టీఎంసీలుగా ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఉత్పత్తి అనంతరం మిగిలిన 6,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
srisailm project: శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ప్రవాహం.. - pulichitala project news
ఏపీలోని శ్రీశైలం జలాశయంలో(srisailm project) వరద ప్రవాహం తగ్గుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 811.70 అడుగులుగా ఉంది. సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా పులిచింతలకు 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు 42 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తేందుకు పులిచింతల అధికారుల సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ప్రవాహం..
పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... 39.88 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా పులిచింతలకు 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు 42 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తేందుకు... అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దిగువన లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా