తెలంగాణ

telangana

ETV Bharat / city

అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు

హైదరాబాద్​ అడ్డగుట్టలో వరద ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. అడ్డగుట్ట కార్పొరేటర్ విజయ కుమారి ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వం సాయం నిలిపేయటం పట్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు
అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు

By

Published : Oct 31, 2020, 1:48 PM IST

హైదరాబాద్​లో వరద ముంపు బాధితులకు ప్రభుత్వం సాయం నిలిపేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగుట్ట కార్పొరేటర్ విజయ కుమారి ఇంటిని స్థానికులు ముట్టడించారు. ఈ క్రమంలో బాధితులకు, తెరాస నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తెరాస నేతలు, కార్పొరేటర్ తమ అనుయాయులు పార్టీ నేతలకు మాత్రమే సాయం ఇప్పించి అసలైన అర్హులకు అందజేయలేదని బాధితులు ఆరోపించారు. పంపిణీలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని తెరాస నేతలు, అధికారులు డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులందరికి సాయం అందచేయాలని అఖిలపక్షం నేత అజయ్​బాబు డిమాండ్ చేశారు.

పేద ప్రజలు ఎక్కువగా ఉన్న అడ్డగుట్టలో 30శాతం మందికి మాత్రమే సాయం అందజేయడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా పునరాలోచించి పంపిణీ చేయాలని కోరుతూ... సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 2 లక్షల 38 వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details