హైదరాబాద్లో వరదల వల్ల నష్టపోయిన బాధితులు ప్రభుత్వ సాయం పొందేందుకు ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులుగా బాధితులు మీసేవల వద్ద భారీ క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
తెల్లవారుజామున 4 గంటలకే మీసేవల వద్ద క్యూలైన్లు
హైదరాబాద్లో వరద బాధితులు సాయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీసేవల ముందు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా... 4 గంటల నుంచే మీసేవా కేంద్రాల వద్ద వేచిచూస్తున్నారు.
flood affected people waiting in front of mee seva
మల్లాపూర్ డివిజన్లో వరదసాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీసేవా కేంద్రాల ముందు తెల్లవారుజామున 4గంటల నుంచే బాధితులు క్యూ కట్టారు. చలిని సైతం లెక్క చేయకుండా.. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.