తెలంగాణ

telangana

ETV Bharat / city

Flights Cancelled Due to Cyclone Asani: విమాన రాకపోకలపై అసని ఎఫెక్ట్.. - కాకినాడ బీచ్ రోడ్డుపైకి ఎగసిపడుతున్న కెరటాలు

Flights Cancelled Due to Cyclone Asani: 'అసని' ప్రభావం.. విమాన రాకపోకలపై పడింది. ఏపీ విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు వెనుదిరిగాయి.

Asani
Asani

By

Published : May 10, 2022, 8:27 AM IST

Flights Cancelled Due to Cyclone Asani: తీవ్ర తుపాను 'అసని' ప్రభావం.. విమాన రాకపోకలపై పడింది. ఏపీ విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు వెనుదిరిగాయి. హైదరాబాద్, ముంబయి, చెన్నై, విజయవాడ, రాజమహేంద్రవరంలో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి.

ఉప్పాడ తీరంపై తుపాను ప్రభావం:కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సమీప గ్రామాల్లో ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బలమైన ఈదురుగాలులకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ దురుగాలులకు భారీ పంటు ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చింది. కాకినాడ బీచ్ రోడ్డుపైకి కెరటాలు ఎగసిపడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details