ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో.. ప్రయాణికులకు సేవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10.10గంటలకు మొదటి విమానం బెంగళూరు నుంచి కర్నూలు చేరుకుంది. ఉదయం 10.30 గంటలకు కర్నూలు నుంచి విమానం విశాఖకు బయల్దేరింది.
ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభం - కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
ఏపీలోని కర్నూలు విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఓర్వకల్లులో ఉన్న ఎయిర్ పోర్టుకు.. బెంగళూరు విమానం చేరుకుంది.
![ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభం kurnool airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11189301-78-11189301-1616908180046.jpg)
kurnool airport
కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమానాల సేవలు నడవనున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో.. ఇప్పుడు విమానాల రాకపోకలతో సందడి నెలకొంది.