FLEXI WAR నగరంలో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేపుతోంది. నేడు రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన, మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా నగరంలోని పలుచోట్ల 'తడిపార్ కౌన్ హై' అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వెనక్కి తిరిగి పారిపోతున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? అంటూ వెలసిన ఈ వ్యంగ్య పోస్టర్లపై బైబై మోదీ అంటూ ఉండటం గమనార్హం. బేగంపేట, సికింద్రాబాద్ మార్గాల్లో వెలసిన ఈ పోస్టర్లు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి.
నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్, అమిత్‌షా రాక ముందు కాక
FLEXI WAR రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన, మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో తెరాస వర్సెస్ భాజపా అన్నట్లు నడుస్తోంది. ఇరుపార్టీలు హోర్డింగులు, పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని పలుచోట్ల ఒకవైపు అమిత్‌షాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువగా, మరోవైపు కేసీఆర్‌కు మద్దతుగా అన్‌బ్రేకబుల్ తెలంగాణ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
మరోవైపు 'అన్ బ్రేకబుల్ తెలంగాణ', కేసీఆర్ పేరిట రూపొందించిన వీడియోలు... సామాజిక మధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వైఎస్ఆర్ పేరిట ఆ వీడియోలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌కే గర్వకారణంగా చెబుతున్న తీగలవంతెన, టీ-హబ్, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం సహా.. భారీగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్లెక్సీలు, కటౌట్ వద్ద ఓ వ్యక్తి నిల్చొని అన్‌బ్రేకబుల్ తెలంగాణ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న వీడియోలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇవీ చదవండి: