తెలంగాణ

telangana

ETV Bharat / city

Flexi Conflict: పార్కులో మద్యం ఫ్లెక్సీ.. విస్తుపోతున్న సందర్శకులు - పార్కులో మద్యం ఫ్లెక్సీ

Flexi Conflict: ఆరోగ్యం కోసం పార్క్​కు వచ్చే వారికి వింత అనుభవం ఎదురవుతోంది. చెడు వ్యసనాలను వీడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పార్క్​కు వచ్చే ప్రాంతంలో 'మద్యం తాగండి... మా దగ్గర ధరలు తక్కువ' అనే బ్యానర్లు వెలిశాయి. ఆరోగ్యం కోసం వచ్చే ప్రదేశాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రచారం ఏంటని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Flexi Conflict: పార్కులో మద్యం ఫ్లెక్సీ.. విస్తుపోతున్న సందర్శకులు
Flexi Conflict: పార్కులో మద్యం ఫ్లెక్సీ.. విస్తుపోతున్న సందర్శకులు

By

Published : Feb 25, 2022, 1:59 PM IST

Flexi Conflict:ఏపీలోని విజయవాడ బెరంపార్క్​లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకటన విమర్శలకు తావిస్తోంది. 'మా బార్​లో అన్ని రకాల మద్యంపై తగ్గింపు ధరలు' అని మద్యం సీసాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బెరంపార్క్ ప్రధాన ద్వారం, పార్క్ లోపల ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయటంతో సందర్శకులు విస్తుపోతున్నారు.

పార్క్​కు విదేశాల నుంచి సైతం యాత్రికులు వస్తుండటంతో బార్ ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో సందర్శకులు బెరంపార్క్​కు వెళుతుంటారు. అటువంటి ప్రదేశంలో ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేయటం ఏంటని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details