తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

రాష్ట్ర వార్షికి బడ్జెట్​ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రవేశపెట్టారు. రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు.

runamafi
'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

By

Published : Mar 18, 2021, 1:08 PM IST

Updated : Mar 18, 2021, 2:40 PM IST

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రైతులకు, లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్​ రావు గుర్తు చేశారు. రూ.25 వేల ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్నా రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. ఏ కారణంతోనైనా రైతులు మరణిస్తే బాధిత కుటుంబం అనాథ కావొద్దని ప్రభుత్వం భావించిందని హరీశ్​రావు తెలిపారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణించినా ఆ అన్నదాత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం రూ.1141.4 కోట్లను ప్రభుత్వం ఎల్​ఐసీకి చెల్లించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు అందించినట్లు తెలిపారు.

గంట భూమి కలిగి ఉన్నా.. రైతు బీమా వర్తిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారని హరీశ్​ అన్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారన్నారు. దీని వల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బీమా పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'

ఇవీచూడండి:2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

Last Updated : Mar 18, 2021, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details