తెలంగాణ

telangana

ETV Bharat / city

అమ్మమ్మ ..అమ్మమ్మతో ఫొటో..! - చోడవరంలో ఐదుతరాల మహిళలు తాజా వార్తలు

అమ్మలందరూ ఓకేచోట చేరితే ఎంతో బాగుంటుంది. అమ్మ, అమ్మ వాళ్ల అమ్మ ..కుదిరితే అమ్మమ్మ వాళ్ల అమ్మను చూడొచ్చు. కానీ విశాఖలో మాత్రం అమ్మమ్మకు ..అమ్మమ్మ ఉంది. మీరూ చూస్తారా..!

five-generations-woman-at-chodavaram
అమ్మమ్మ ..అమ్మమ్మతో ఫొటో..!

By

Published : Mar 8, 2021, 2:46 PM IST

ఏపీలోని విశాఖలో 98 ఏళ్ల కాసులమ్మ అనే పెద్దావిడ ఉంది. ఆమె కుమార్తె ఈశ్వరమ్మకు 68 ఏళ్లు. ఈశ్వరమ్మ కూతురు అచ్యుతాంబకు 50 సంవత్సరాలు. అచ్యుతాంబ తనయ లక్ష్మీప్రసన్నకు 30ఏళ్లు. ఆమె సంతానం దర్శినీయకు అయిదేళ్లు. వారంతా విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో నివాసముంటున్నారు. అచ్యుతాంబ రైల్వే ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒక్కచోట చేరి వారందరూ తమ అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

వారు స్త్రీ మూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలు పుడితే భయపడాల్సిన అవసరం లేదని, అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు రాణిస్తున్నారని న పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details