తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐదు రోజుల పెళ్లి.... జిల్లా అంతటా సందడి - ఏపీలో ఘనంగా వివాహం

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రమంతా చెప్పుకునే విధంగా జరిగింది విశాఖ జిల్లాలో ఓ పెళ్లి. ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరిగా మారాయా అనే విధంగా ఏర్పాట్లు చేశారు. సంప్రదాయాలు కళ్లకు కట్టేలా అన్నీ తీర్చిదిద్దారు. తిరునాళ్లను తలపించేలా పెళ్లికి జనం విచ్చేశారు. శుభలేఖలు నుంచి విందు భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే.

five days wedding at andhra pradesh state latest news
five days wedding at andhra pradesh state latest news

By

Published : Jan 31, 2020, 10:01 PM IST

ఐదు రోజుల పెళ్లి.... జిల్లా అంతటా సందడి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండల కేంద్రం మహాకవి గురజాడ జన్మస్థలంలో మరపురాని విధంగా ఐదు రోజుల పెళ్లితో ఒక్కటైంది ఓ జంట. పురాతన సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కల్యాణం ప్రత్యేకతను సంతరించుకుంది. వినూత్నంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. లక్ష మందికి పైగా రావటంతో ఈ వివాహ మహోత్సవం జాతర వేడుకగా మారింది.

ఎన్నెన్నో విశిష్టతలు...
ఎస్. రాయవరం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తెను బయ్యవరం గ్రామానికి చెందిన మరో వ్యాపారి కుమారుడికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఐదు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. 10 ఎకరాల కొబ్బరి తోటలో తాటాకు పందిరి వేయించారు. విశాలంగా కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. ఒకేసారి 20 వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇటుకలు, మట్టి, ఆవు పేడతో అలికి పెళ్లి అరుగు తయారు చేశారు. పెళ్లి విశిష్టతను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని రకాల పండ్లతో పెళ్లి పందిరిని అలంకరించారు. తాళపత్ర గ్రంథంలో శుభలేఖలు అచ్చు వేయించారు. ఎన్నో విశిష్టతలకు నిలయంగా ఈ వివాహాన్ని జరిపించారు. ఊహించని విధంగా ఈ వేడుకలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలిరావటంతో గ్రామంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ABOUT THE AUTHOR

...view details