చిన్నగంజాం మండలం పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులు ఆదివారం వేటకు వెళ్లగా వారు వేసిన వలలో సుమారు వేయి కిలోల నల్లకోతి రకం సొర చేప చిక్కింది. పల్లెపాలెంకు చెందిన మత్య్సకారులు రమేష్, సోమయ్య, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, ఏడుకొండలు, చంద్రనారాయణ, బాలకృష్ణ వీరందరూ కలిసి ఆదివారం రాత్రి తీరానికి 16కిలోమీటర్ల దూరంలో పడవ నుంచి వలను వదిలారు. ఈ క్రమంలో పెద్ద సొరచేప వలకు చిక్కింది. సోమవారం ఉదయం వలను చూడగా పెద్ద సొరచేప వలకు పడ్డట్లు గుర్తించారు.
ప్రకాశం జిల్లా మత్స్యకారులకు చిక్కింది ‘సొర’.. ఎంతో ధర! - మత్స్యకారుల వలలో భారీ సొర చేప
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు భారీ నల్లసొర చేప చిక్కింది. దీని బరువు సుమారు వెయ్యి కిలోలు ఉంటుందని మత్స్యకారుల అంచనా.
ప్రకాశం జిల్లా మత్స్యకారుల వలకు చిక్కిన భారీ సొర చేప
వెంటనే ఆ చేపను ఒడ్డుకు చేర్చడానికి సుమారు పది గంటల సమయం పట్టినట్లు మత్య్సకారులు తెలిపారు. దీంతో ఆ చేప తాకిడికి రూ.50వేల విలువ చేసే వల సైతం తెగిపోయింది. సొరచేప విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ చేపను చూడటానికి తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: 'మాస్క్ ధరించలేదని... అపస్మారకస్థితికి చేరేలా కొట్టారు'
Last Updated : Jul 20, 2020, 10:46 PM IST