రాష్ట్రంలో 4వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నది. 74 ప్రధాన జలాశయాలు, 24 వేల చెరువులు, ఇతర నీటి వనరుల్లో... రూ.50 కోట్ల వ్యయంతో 81 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రూ. 10 కోట్ల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలు విడుదలకు రంగం సిద్ధం చేసింది. తొలిరోజు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని పెంటాని చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి... పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్గొనున్నారు.
మొదటగా ఈ నెల 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున మరుసటి రోజుకు వాయిదా వేశారు. అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మడిగట్లలోని మడికాని చెరువు, కోడూరులో మైసమ్మ చెరువులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేప పిల్లలు విడుదల చేస్తారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామంలో వెంకాయకుంట చెరువులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేస్తారు.