ఏపీలోని కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,05,736 క్యూసెక్కులు ఉంది. ముందు జాగ్రత్తగా వరద ప్రభావిత మండలాల అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం లాంటివి చేయరాదని కలెక్టరు హితవు పలికారు.
ఇదీ చదవండి: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ