తెలంగాణ

telangana

ETV Bharat / city

Gay marriage in Hyderabad: రాష్ట్రంలో ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. సమంత విషెస్ చెప్పింది! - gay couple wedding in india

Gay marriage in Hyderabad: తెలంగాణ‌లో ఘనంగా తొలి గే మ్యారేజ్ జరిగింది. దీనికి హైదరాబాద్​ వేదికైంది. 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఇద్దరు పురుషులు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లు హాజరై గే జంటను ఆశీర్వదించారు.

first gay marriage in telangana done in hyderabad
first gay marriage in telangana done in hyderabad

By

Published : Dec 19, 2021, 8:15 PM IST

Updated : Dec 20, 2021, 10:06 AM IST

Gay marriage in Hyderabad: భాజాభ‌జంత్రీలు.. చుట్టూ బంధువులు.. హ‌ల్దీ, మెహందీ వేడుక‌లు.. వీట‌న్నింటి న‌డుమ వరుడు, వధువు ఒక్కటయ్యే వేడుకే వివాహం. మరి ఆ వివాహంలో పెళ్లిపిల్ల స్థానంలోనూ పిల‌గాడే ఉంటే అది ప్ర‌త్యేకం. అలాంటి ప్ర‌త్యేక వేడుక‌కు వేదిక‌య్యింది హైద‌రాబాద్‌. దేశంలో ఇప్పటివరకు పలు చోట్ల లెస్బియ‌న్, గే పెళ్లిళ్లు జరగ్గా.. తెలంగాణలో తొలిసారి ఈ ప్రత్యేక వివాహం జరిగింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం(డిసెంబర్​ 08)రోజు... గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్‌ డాంగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల స‌మ‌క్షంలో వీళ్ల పెళ్లి ఎంతో గ్రాండ్​గా జ‌రిగింది. వేడుకలో ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు.

వివాహ వేదికపై జంటగా వెళ్తూ..
ఉంగరాలు మార్చుకుంటున్న తరుణంలో..

వాళ్లు ఆశీర్వదించటం విశేషం..

First Gay Wedding in Telangana: ఈ పెళ్లికి ఇద్ద‌రు నూత‌న వ‌రుల కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఎల్‌జీబీటీక్యూ క‌మ్యూనిటీ నుంచి కొంద‌రు స‌భ్యులు హాజరయ్యారు. ఫొటోషూట్​లు, సన్నిహితుల ఈలలు, గోలలతో ఎంతో కోలాహలంగా వేడుక సాగింది. ఈ వివాహానికి హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రు ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ‌లు హాజ‌రై.. గే జంటను ఆశీర్వ‌దిచటం విశేషం. అధికారికంగా ధ్రువీక‌ర‌ణ ద‌క్క‌కున్నా.. తామ పెళ్లిని ఓ వేడుక‌లా చేసుకోవాల‌నుకున్నామ‌ని.. అందుకే పంజాబ్‌, కోల్‌క‌తా నుంచి ప్ర‌త్యేక దుస్తుల్ని డిజైన్ చేపించి మ‌రీ వివాహం చేసుకున్నామ‌ని ఈటీవీతో పంచుకున్నారు సుప్రియో. ఒక‌ర్ని ఒక‌రు అర్థం చేసుకునే మ‌న‌సుతో ఇలాగే జీవితాంతం క‌లిసుంటామ‌ని చెబుతున్నారిద్ద‌రు.

వివాహబంధంతో ఒక్కటైన వేళ..

8 ఏళ్ల సహజీవనం తర్వాత..

gay couple dating: సుప్రియో చక్రవర్తి ఓ బెంగాలీ కాగా.. హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన అభయ్‌ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు​. సుప్రియో వ‌య‌సు 31 ఏళ్లు. అభ‌య్ వ‌య‌సు 34 ఏళ్లు. తాము ఇద్ద‌రు 'గే'ల‌మ‌ని వాళ్ల‌కు చిన్న‌త‌నంలోనే తెలిసింద‌ట‌. వీళ్లిద్ద‌రికి 8 ఏళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. స్నేహం ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ‌గా మారింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

వివాహవేడుకలో మెహందీని చూపిస్తూ..
ఒకరి పేరు ఇంకొకరి చేతుల్లో..

సమంత కూడా మద్దతు..

gay couple wedding: అయితే.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అక్టోబర్​లోనే డిసైడ్​ అయ్యారు. వెంటనే తమ నిర్ణయాన్ని ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు. అప్ప‌టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. వీళ్ల పెళ్లి చర్చనీయాంశమైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత కూడా వీళ్ల పెళ్లికి మ‌ద్ద‌తిచ్చింది. అభినంద‌న‌లు తెలుపుతూ.. వాళ్లు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేసింది.

ఒక్కటైన ఆనందంలో...

ఇదీ చూడండి:

Last Updated : Dec 20, 2021, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details