రాష్ట్రంలో కరోనాతో తొలి వైద్యుడు మృతి
12:53 June 22
రాష్ట్రంలో కరోనాతో తొలి వైద్యుడు మృతి
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఓ వైద్యుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు. నగరంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న వైద్యుడు జ్ఞానేశ్వర్(70)వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. దీనికితోడు బీపీ కూడా ఉండటం వల్ల ఆ డాక్టర్ చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు మృతి చెందారు. హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న ఆ వైద్యుడు. కారోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి క్లినిక్‌ని మూసివేసినట్టు తెలిసింది.
ఇదీ చూడండి :ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. బతికుండగానే.!
TAGGED:
doctor died