తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccination: స్పెషల్​ డ్రైవ్​లో మొదటి రోజు 26,892 మందికి వాక్సిన్

జీహెచ్​ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొదటి రోజు 26,892 మందికి వాక్సిన్ ఇచ్చారు. 264 కాలనీలు వంద శాతం వాక్సిన్ తీసుకున్న కాలనీలుగా అధికారులు ప్రకటించారు

First Day Vaccination special drive in hyderabad
First Day Vaccination special drive in hyderabad

By

Published : Aug 24, 2021, 5:07 AM IST

గ్రేటర్ హైదరాబాద్​లో అర్హులైన వారందరికీ వంద శాతం కొవిడ్‌ వ్యాక్సిన్ అందించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొదటి రోజు 26,892 మందికి వాక్సిన్ ఇచ్చారు. 264 కాలనీలు వంద శాతం వాక్సిన్ తీసుకున్న కాలనీలుగా ప్రకటించి... వారికి ప్రత్యేక అభినందన సర్టిఫికెట్​లను అధికారులు అందజేశారు. జీహెచ్ఎంసీలోని 4846 కాలనీలు, బస్తీల్లో పూర్తి స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్ అందచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పది రోజుల పాటు ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

​టీకా వాహనాల సాయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 23651 మందికి మొదటి డోస్​ అందజేశారు. 3241 మందికి రెండో డోస్ టీకా అందజేశారు. మొదటి, రెండో డోసులతో కలిపి మొత్తం 26892 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో తొలిరోజు 264 కాలనీలను వంద శాతం వ్యాక్సిన్ తీసుకున్న కాలనీలుగా గుర్తించినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. కాగా... నగరంలో ప్రారంభించిన ప్రత్యేక మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్జ్వి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ పరిశీలించారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:

CM KCR: అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details