దాదాపు ఆరు నెలల తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం... జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 25శాతం బస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. నగరంలో ఉన్న 29డిపోల్లో 3500 పైగా బస్సులు ఉన్నాయి. వెయ్యికి పైగా బస్సులు కాలం చెల్లినవి కావడం వల్ల వాటిని బయటకు తీయడం లేదు. మిగిలిన 2,500 బస్సుల్లో ఆరువందలకుపైగా సర్వీసులు నడుపుతున్నారు.
సిటీ బస్సుల్లో మొదటి రోజు అంతంత మాత్రమే! - ఆర్టీసీ బస్సులలో అంతంత మాత్రంగా ప్రయాణికుల
కరోనాతో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... ఇవాళ భాగ్యనగర రోడ్లపైకి ఎక్కాయి. 25 శాతం సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారుల నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులను పెంచాలని యోచిస్తున్నారు.
సిటీ బస్సుల్లో మొదటి రోజు అంతంత మాత్రమే!
ఇన్ని రోజుల నుంచి ప్రయాణికులు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తున్నందున... ఈ రోజు బస్సుల్లో తక్కువగానే ఎక్కారు. రద్దీని బట్టి బస్సులు పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. కరోనా దృష్ట్యా... బస్సులను శానిటైజ్ చేసి బయటకు పంపుతున్నారు. నిబంధనల ప్రకారమే ప్రయాణికులను కూర్చొబెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతికదూరం పాచించాలని చెప్తున్నారు.
ఇదీ చూడండి:ఆరు నెలల తర్వాత హైదరాబాద్లో ఆర్టీసీ సేవలు