Jubileehills gang rape case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో మైనర్లకు ఐదు రోజుల కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డ్ అనుమతించింది. దీంతో మొత్తం ఐదుగురిని కలిసి పోలీసులు ప్రశ్నించనున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలకమైన మెడికల్ రిపోర్టులు పోలీసులకు చేరాయి. ఈ ఘటనలో బాలిక మెడపై గాయాలైనట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. అత్యాచారం జరిగినట్లు నివేదికలో నిర్ధరించారు. ఈ కేసులో నిందితులైన మైనర్లకు ఐదు రోజుల కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించగా.. మొదటి రోజు వృథా అయ్యింది. శుక్రవారం నుంచే మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉండగా.. అది సాధ్యపడలేదు. ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే. ఇందులో ముగ్గురిని శక్రవారం నుంచి ఐదురోజుల పాటు.. జువైనల్ హోమ్‌లోనే న్యాయవాది సమక్షంలో విచారించి వాంగ్మూలం తీసుకోవాలని జువైనల్ జస్టిస్ బోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఏసీపీ నర్సింగరావు సైదాబాద్‌లోని జువైనల్ హోంకు చేరుకున్నారు. ప్రత్యేక గదిలో బాలురను ప్రశ్నించేలా అనుమతి ఇవ్వాలని జువైనల్ హోం పర్యవేక్షకుడిని ఏసీపీ కోరారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఇచ్చిన ఆదేశాల్లో ఆ విధంగా లేదని... ముగ్గురు మైనర్లను జువైనల్ హోంలో కాకుండా బయటికి తీసుకెళ్లి ప్రశ్నించండని పర్యవేక్షకుడు సూచించారు. జువైనల్ హోంలోనే ప్రశ్నించే విధంగా బోర్డు నుంచి ఆర్డర్ తీసుకొస్తే దానికి అంగీకరిస్తామని పర్యవేక్షకుడు తెలిపారు. చేసేదేమీలేక.. ఏసీపీ నర్సింగరావు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చూడండి:జూబ్లీహిల్స్ రేప్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
మైనర్లను పోలీస్‌స్టేషన్‌లోనే విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి రోజైన నేడు.. మైనర్లను ప్రశ్నించకుండానే ముగిసింది. రేపు ఉదయం 10 గంటలకు ముగ్గురు మైనర్లను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకెళ్లనున్నారు. పదింటి నుంచి ఐదింటి వరకు పీఎస్‌లోనే మైనర్లను ప్రశ్నించనున్నారు. 5 గంటల తర్వాత తిరిగి జువైనల్ హోమ్‌కి మైనర్లను తరలిస్తారు. ఈనెల 14 వరకు ముగ్గురు మైనర్లను ప్రశ్నించనున్నారు.