హైదరాబాద్ చైతన్యపురిలోని రుషిత చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ అభిప్రాయపడ్డారు. సామాజిక సేవలో ముందుంటున్న ట్రస్ట్ సభ్యులను అభినందించారు.
పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ
మానవసేవే మాదవ సేవ అంటూ రుషిత చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతున్నారు. అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక.. చాలా మంది మృతి చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణాల రేటును తగ్గించడానికి ప్రాధమిక చికిత్స ఎంతగానో ఉపయోగపడుతోందనే నమ్మకంతో... పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేశారు.
first aid kit
TAGGED:
rachakonda cp latest news