ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసులకు, గ్రేహౌండ్స్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పాడేరు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు సమావేశమమయ్యారన్న పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో గాలిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగగా మావోయిస్టులు తప్పించుకుపోయారు.
విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు - vishakapatnam latest news
ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకోగా సంఘటన స్థలం వద్ద 6 కిట్ బ్యాగులు, ఒక తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు...తప్పించుకున్న మావోయిస్టులు
సంఘటన స్థలం వద్ద 6 కిట్ బ్యాగులు, ఒక 303 తుపాకి దొరికిందని పాడేరు డిఎస్పీ రాజ్ కమల్ తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఎవరైనా గాయపడ్డరా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి