విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో మంటలు చేలరేగాయి. ఉదయం 5 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష శిబిరంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో దీక్షా శిబిరం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
'కావాలనే తగులబెట్టారు'
దీక్షా శిబిరానికి ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిబిరం తాటాకుతో నిర్మితమై ఉందని, ఎలాంటి విద్యుత్ ప్రమాదం సంభవించే అవకాశమే లేదన్నారు. భవిష్యత్ కార్యాచరణకై అఖిల పక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో నేడు సమావేశం నిర్వహించనున్నట్లు సమితి ఛైర్మన్ జగ్గు నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి:మరో రెండు నెలల్లో 2 కోట్ల స్పుత్నిక్ వీ టీకాలు: రెడ్డీస్