తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్​ రైలు నిలయంలో 'మాక్​ డ్రిల్​' - fire service mock drill

అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా బయటపడడమే కాకుండా.. నష్ట నివారణ చర్యలు తీసుకోవడం కూడా అత్యంత కీలకం. వందల మంది ప్రయాణించే రైలు నిలయాల్లో ప్రమాదాలు సంభవిస్తే.. సిబ్బంది ఏవిధంగా స్పందించాలి.. ప్రయాణికులను ఎలా రక్షించాలి.. అందుబాటులో ఉన్న పరికరాలతో మంటలను ఎలా ఆర్పాలి.. అనేదానిపై సికింద్రాబాద్​ రైలు నిలయంలో రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ మాక్​ డ్రిల్​ నిర్వహించింది.

సికింద్రాబాద్​ రైలు నిలయంలో 'మాక్​ డ్రిల్​'

By

Published : Oct 19, 2019, 7:43 AM IST

సికింద్రాబాద్​ రైలు నిలయంలో 'మాక్​ డ్రిల్​'

అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ యంత్రాంగం సిద్ధమైంది. సికింద్రాబాద్​ రైలు నిలయంలో మాక్​ డ్రిల్​ నిర్వహించింది.

మాక్​ డ్రిల్​ ఎలా సాగిదంటే..

వందల మంది పనిచేసే రైల్వేస్టేషన్​లో మంటలు చేలరేగాయి. అక్కడ ఉండే భద్రతా సిబ్బంది హెచ్చరిక గంటలు మోగించారు. ఆ భవనంలో ఉన్న సిబ్బంది మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకున్నారు. కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మాక్​ డ్రిల్స్​​ వల్ల సిబ్బంది సన్నద్దత, అగ్నిమాపక పరికరాల పనితీరుపై స్పష్టత వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​ గజానన్​ మాల్యా అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇవీచూడండి: సాగర్​ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details