హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హుడా సాయినగర్‌లోని ఎస్.ఎస్.ఆర్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోని.. ఫ్లాట్ నెంబర్ 504లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడటంతో అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంలో ఫ్లాట్‌లో ఉన్న గృహోపకరణాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. అపార్టుమెంట్లో మంటలు - తెలంగాణ వార్తలు
వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్.ఎస్.ఆర్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి.
వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. అపార్టుమెంట్లో మంటలు
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చూడండి: దారుణం:పట్టపగలు.. ప్రాణం తీసిన పగలు
Last Updated : Jan 27, 2021, 8:01 AM IST